- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిస్టరీగా మారిన వలస కూలీ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, కుకునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు మండల కేంద్రంలో వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు తాపీ వర్కర్లు ఉపాధి నిమిత్తం కుకునూరుకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరు మండలంలో పునరావాస నిర్మాణ కాలనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు, శివరాం దాస్ అనే వర్కర్లు నాలుగు రోజుల క్రిందట పని కోసం వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. వీరి కోసం గాలించిన సదరు […]</p>

X
దిశ, కుకునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు మండల కేంద్రంలో వలస కూలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు తాపీ వర్కర్లు ఉపాధి నిమిత్తం కుకునూరుకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలోనే వీరు మండలంలో పునరావాస నిర్మాణ కాలనీల్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధు, శివరాం దాస్ అనే వర్కర్లు నాలుగు రోజుల క్రిందట పని కోసం వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. వీరి కోసం గాలించిన సదరు కూలీలు ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ఓ నూతన భవనం వెనకాలే ఉన్న చెట్ల పొదల్లో శివరాం దాస్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగుండొచ్చని.. ఈ క్రమంలోనే శివరాం దాస్‌ను మధు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Next Story






