సొసైటీలో ఫేస్‌కే ఇంపార్టెన్స్.. యాసిడ్ దాడి బాధితురాలి న్యూ ఇన్సింగ్స్

by  |
సొసైటీలో ఫేస్‌కే ఇంపార్టెన్స్.. యాసిడ్ దాడి బాధితురాలి న్యూ ఇన్సింగ్స్
X

దిశ, ఫీచర్స్ : ‘సర్వధర్మసమభావన, వసుధైక కుటుంబం, ‘ఆమె’ ఆదిశక్తి’ వంటి భావనలను ప్రపంచానికి అందించిన భారత్‌లో మహిళలపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణకు ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఈ తరహా దాడులు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మహిళల రక్షణకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని, ప్రత్యేక నిఘా విభాగాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే యాసిడ్ దాడి బాధితులు ఆయా ఘటనలతో కుంగిక్రుశించి పోకుండా మనోధైర్యంతో నూతన జీవన ప్రారంభించి స్ఫూర్తిప్రదాతలుగా నిలుస్తున్నారు. ఆ కోవకే చెందిన నారీమణే ఒడిషాలోని జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన ప్రమోదిని రౌల్.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచేందుకు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకుంది ప్రమోదిని. ఆ సమయంలో తనకు ఓ మ్యారేజ్ ప్రపోజల్ రాగా, తనకు ఇంకా చదువుకోవాలనుందని ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తనను రిజెక్ట్ చేసిందన్న కోపంతో ప్రమోదినిపై పారా మిలిటరీ జవాన్ సంతోశ్ వేదాంత్ కుమార్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన 2009 మార్చి 4న జరిగింది. దాడి తర్వాత కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే తన శరీరం ముఖంతో పాటు 80 శాతం కాలిపోయింది. సగం శరీరం పక్షవాతానికి గురై, కంటి చూపును కూడా కోల్పోయింది. ఇక తాను అందరిలా ఫేస్ చూసుకుని ఆనంద పడలేనని మానసిక వేదన అనుభవించిన ప్రమోదిని.. ఐసీయూలో 9 నెలల పాటు ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు 2014లో భువనేశ్వర్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ సరోజ్ సాహు ఆస్పత్రిలోనే పరిచయమయ్యడు. ప్రమోదినికి ధైర్యం చెప్పేందుకు తన జాబ్ కూడా వదులకున్న సరోజ్.. ఆమె కోలుకునేంత వరకు అండగా నిలవడం విశేషం. కాగా, తన జీవితంలో చేసిన గొప్ప పని అతడిని ఇటీవల పెళ్లి చేసుకోవడమేనన్న ప్రమోదిని, యాసిడ్ దాడి బాధితులు జీవితంపై ఆశలు వదులుకోవద్దని కోరింది. సరోజ్ సాహుయే జీవితంలో తన ధైర్యమని తెలిపింది.

సొసైటీలో ఫేస్‌కే ఇంపార్టెన్స్ : ప్రమోదిని రౌల్

ప్రస్తుత సమాజంలో పెళ్లి జరగాలంటే అమ్మాయి ముఖమే ఇంపార్టెంట్ అయింది. వధువు ఫేస్ చూసే మ్యారేజ్ చేసుకునే పరిస్థితులుంటాయని నేనసలు ఊహించలేదు కానీ అదే రియాలిటీ. అయితే నా విషయంలో అలా జరగలేదు. నేను నా కుటుంబంతో పాటు నా జీవిత భాగస్వామి కుటుంబ అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలానే నా మ్యారేజ్ జరిగింది.


Next Story

Most Viewed