‘ఓదెల రైల్వేస్టేషన్’లో షూటింగ్

by  |
‘ఓదెల రైల్వేస్టేషన్’లో షూటింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఓదెల గ్రామంలో జరిగిన యదార్థఘటన ఆధారంగా తెరకెక్కుతున్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’. మేకప్, సాంగ్స్, డిఫరెంట్ కాస్టూమ్స్ లాంటివి లేకుండా పూర్తి సహజంగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్, కన్నడ నటుడు వశిష్ట సింహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంపత్ నంది కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ఈ మధ్యే లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం ఓదెలలో షూటింగ్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఓదెల గ్రామంలోని నిజమైన అందాలను క్యాప్చర్ చేస్తున్నట్లు తెలిపిన సంపత్ నంది.. ఓదెల రైల్వే స్టేషన్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిత్రీకరణకు పూర్తిగా సహకరిస్తున్న గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. షూటింగ్ స్పాట్ నుంచి పిక్చర్స్ షేర్ చేశారు.

కాగా పల్లెటూరి అమ్మాయి లుక్‌లో విడుదలైన హెబ్బా ఫొటోలకు ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా తన కెరియర్‌లోనే బెస్ట్ అవుతుందని నమ్ముతోంది. కాగా, ఈ విలేజ్ లవ్ స్టోరీలో సాయి రోనక్, పూజిత పొన్నాడ, నాగ మహేశ్, భూపాల్, శ్రీ గగన్, దివ్య, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Next Story

Most Viewed