- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రోజు ఏమి కొన్నా శుభాలే.. 677 ఏళ్ల తర్వాత మంచి ముహూర్తం
<p>దిశ, డైనమిక్ బ్యూరో : ఏదైనా కార్యక్రమం చేయాలన్నా.. వస్తువులు కొనాలన్నా ముహుర్తాలు చూడటం ఆనవాయితీ. కొందరు దీనిని సీరియస్‌గా తీసుకుంటుంటారు. మంచి ముహూర్తం కోసం కొన్ని నెలలు వెయిట్ చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అందులోనూ పుష్య నక్షత్రం వస్తుందంటే చాలు బంగారు, వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, సాధారణంగా పుష్య నక్షత్రం ఏడాదికోసారి వస్తుంది. కానీ, ఈ ఏడాది వచ్చే పుష్య నక్షత్రం మాత్రం రోజు చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈసారి దీపావళికి […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : ఏదైనా కార్యక్రమం చేయాలన్నా.. వస్తువులు కొనాలన్నా ముహుర్తాలు చూడటం ఆనవాయితీ. కొందరు దీనిని సీరియస్‌గా తీసుకుంటుంటారు. మంచి ముహూర్తం కోసం కొన్ని నెలలు వెయిట్ చేయడానికైనా సిద్ధపడుతుంటారు. అందులోనూ పుష్య నక్షత్రం వస్తుందంటే చాలు బంగారు, వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే, సాధారణంగా పుష్య నక్షత్రం ఏడాదికోసారి వస్తుంది. కానీ, ఈ ఏడాది వచ్చే పుష్య నక్షత్రం మాత్రం రోజు చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈసారి దీపావళికి ముందు అక్టోబర్ 28 గురువారం రోజున వస్తుంది. గురువారం రోజున వస్తున్నందున గురు పుష్యయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. అంతేకాకుండా, 677 ఏళ్ల క్రితం అంటే 1344లో ఏర్పడ్డ గ్రహస్థితులే ఈ ఏడాది అక్టోబర్ 28న కూడా ఏర్పడనున్నాయని చెబుతున్నారు. అందువల్ల ఆ రోజు బంగారం కొనడం, పెట్టుబడులు పెట్టడం, ఇల్లు లేదా ప్లాట్‌లు కొనడం, వాహనాలు, యంత్రాలు , బట్టలు లాంటివి కూడా కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.






