స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం!

by  |

దిశ, వెబ్‌డెస్క్: కూరగాయల ధరల్లో భారీ పెరుగుదల కారణంగా ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.35 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగింది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం భారీగా పెరగడం వల్లనే ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగిందని కేంద్ర గణాంక కార్యాలయం(ఎన్ఎస్ఓ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌లో అత్యధికంగా 7.61 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉన్న సంగతి తెలిసిందే. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 0.68 శాతం నుంచి 0.85 శాతానికి పెరిగింది.

వరుసగా నాలుగో నెలలోనూ సీపీఐ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే దిగువన ఉంది. 2026, మార్చి వరకు రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4 శాతం(+2 లేదా -2) వద్దే కొనసాగించాలని భారత ప్రభుత్వం ఆర్‌బీఐకి తెలిపింది. అలాగే, ఈ ఏదాది సెప్టెంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) 3.1 శాతం పెరిగిందని ఎన్ఎస్ఓ తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌లో కంటే ఇది ఒక శాతం ఎక్కువ. సమీక్షించిన నెలలో బొగ్గు ఉత్పత్తి 8.6 శాతం పెరగ్గా, విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం పుంజుకుంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story