ఫోను ఓకే.. మరి వ్యాక్సిన్ సంగతేంటి..?

85

దిశ, వెబ్‎డెస్క్: ఇటీవలే ఉత్తరప్రదేశ్‎లో అధికారుల నిర్లక్ష్యంతో కరోనా వాక్సిన్‎కు బదులు రేబిస్ వ్యాక్సిన్ వేసిన వార్త మరువకముందే.. మరో ఘటన ఏపీలోని విజయనగరంలో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి వాక్సినేషన్ వేగవంతం చేస్తుంటే… కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విజయనగరంలో పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్ పీహెచ్‌సీకి చెందిన ఓ నర్సు ఫోన్ మాట్లాడుతూ కరోనా వాక్సిన్ వేసింది. అయితే ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పలువురు జిల్లా వైద్యశాఖాధికారి రమణకుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై స్పందించిన ఆమె, నర్సు హేమలతకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..