ఆ రాత్రి వాష్‌‌రూమ్‌లో చాలా సేపు ఏడ్చా : కృతి సిస్టర్

by  |
krithi-sister
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సిస్టర్ నుపూర్ సనన్ ‘ఫిల్హాల్’ ఆల్బమ్ ద్వారా హిట్ అందుకుంది. కిలాడి అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన ఆల్బమ్‌కు సూపర్ రెస్పాన్స్ రాగా ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న నుపూర్.. సింగర్‌గానూ రాణించేందుకు ట్రై చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భామ.. ఫస్ట్ బ్రేకప్ గురించి వివరించింది. లవర్ తనను మోసం చేశాడన్న విషయం తెలుసుకున్నాక తన పరిస్థితి ‘ఫిల్మీ డ్రామా’ సీన్‌లా ఉందని తెలిపింది.

స్కూల్‌ లెవల్ నుంచే తన ఫ్రెండ్స్ డేటింగ్స్, బ్రేకప్స్ అంటూ బిజీగా ఉన్నారని, తను మాత్రం బాయ్‌ను కాకుండా జెంటిల్‌మెన్ కోసం వెతుకుతూ వెయిట్ చేశానని చెప్పింది. ఈ క్రమంలో డిగ్రీ థర్డ్ ఇయర్‌లో ఒక అబ్బాయితో లవ్‌లో పడ్డానని, కానీ తాను మోసం చేశాడన్న విషయం అర్ధరాత్రి ఒంటిగంటకు తెలిసిందని చెప్పింది. ఇక ఆ సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా చాలా ఏడ్చానని, అమ్మానాన్నకు తనకు గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గట్టిగా ఏడిస్తే వారికి వినిపిస్తుందని వాష్‌రూమ్‌కు వెళ్లి ఏడ్చానని తెలిపింది.

Next Story

Most Viewed