- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కేసులు తగ్గుముఖం.. కానీ ఆ జిల్లాల్లో !
<p>దిశ ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బాధితులు చికిత్స అనంతరం కోలుకుని ఇంటిముఖం పడుతున్నారు. ఏపీలో గడిచిన 24గంటల్లో 52 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,282 మంది కరోనా బారినపడ్డారు. గతంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదై ఆందోళనకు గురిచేయగా ఇప్పుడు చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో గడిచిన 24గంటల్లో 15చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కావడం […]</p>

దిశ ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బాధితులు చికిత్స అనంతరం కోలుకుని ఇంటిముఖం పడుతున్నారు. ఏపీలో గడిచిన 24గంటల్లో 52 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 2,282 మంది కరోనా బారినపడ్డారు. గతంలో కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో భారీగా కేసులు నమోదై ఆందోళనకు గురిచేయగా ఇప్పుడు చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో కేసులు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో గడిచిన 24గంటల్లో 15చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కావడం విశేషం. దీంతో కృష్ణా జిల్లాలో 382 కేసుల్లో 263 మంది డిశ్చార్జి కాగా 104 మంది చికిత్స పొందుతున్నారు. 15 మంది చనిపోయారు.
అటు చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు 192కి చేరుకున్నాయి. 110 మంది చికిత్స పొందుతుండగా 82 మంది కోలుకున్నారు. నెల్లూరులో 7 కేసులు నమోదై మొత్తం 157కు కేసులు చేరుకున్నాయి. 60మంది చికిత్స పొందుతుండగా, 94మంది కోలుకున్నారు. ముగ్గురు మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 5కేసులు బయటపడ్డాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 57కి చేరుకుంది. 43మంది డిశ్చార్జ్ అయితే 14మంది చికిత్స పొందుతున్నారు. కర్నూలుజిల్లాలో 4కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య 615కి చేరుకుంది. ఇందులో 433మంది డిశ్చార్జ్ అయితే, 163 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 19కి చేరుకుంది. కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదు కాగా, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ప్రస్తుతానికి నమోదైన కేసుల సంఖ్య 2,282 కాగా, అందులో 705 యాక్టివ్ కేసులున్నాయి. 1,527 మంది చికిత్స పొంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు.






