జూనియర్ ఎన్టీఆర్‌ ఫేవరేట్ డైరెక్టర్ అతనే

by  |
Nithin, jr NTR
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘చెక్’ మూవీ టీమ్‌కు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుండగా.. ఆల్ ది బెస్ట్ చెప్పారు తారక్. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సూపర్ గ్రిప్పింగ్‌గా ఉంటుందని వెల్లడించారు. చందు యూనిక్ థీమ్స్, స్టోరీ టెల్లింగ్‌కు తను ఫ్యాన్ అని తెలిపిన ఎన్టీఆర్.. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతున్న సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్ కాగా.. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. కాగా తారక్ ట్వీట్‌పై స్పందించిన నితిన్.. థాంక్స్ చెప్పాడు. సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తావని తెలిపారు.

https://twitter.com/actor_nithiin/status/1364876066863476738?s=20

Next Story