- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ చేస్తుంది ఆ కథేనా?
<p>దిశ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్.. క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటించనుండగా.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు కమిటయ్యాడు. అయితే ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీశ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం కావడంతో #PSPK28 పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత […]</p>

దిశ, వెబ్ డెస్క్ :
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పవన్.. క్రిష్ దర్శత్వంలో ఓ పీరియాడిక్ చిత్రంలో నటించనుండగా.. ఆ తర్వాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు కమిటయ్యాడు. అయితే ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ – హరీశ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం కావడంతో #PSPK28 పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీశ్ పవన్ స్క్రిప్ట్ కోసమే బాగా కసరత్తులు చేస్తున్నాడని సమచారం. అయితే ఈ కథ గురించి టాలీవుడ్‌లో కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీశ్ మొదట ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించారని.. కానీ కథ ఆసక్తిగా అనిపించకపోవడంతో ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఇప్పుడు అదే కథను పవర్ స్టార్‌కు వినిపిస్తే .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
అయితే ఒకరు వద్దనుకున్న కథలు, మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయని పవర్ స్టార్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉంటుందని ఈ మధ్య కొన్ని వార్తలొచ్చినా.. వాటిలో నిజంలేదని, సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని హరీష్ క్లారిటీనిచ్చారు. పవన్ కల్యాణ్‌కు నాలుగు హిట్ ఆల్బమ్స్ అందించిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది.






