త్రివిక్రమ్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన ఎన్టీఆర్!

by  |
త్రివిక్రమ్ సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన ఎన్టీఆర్!
X

దిశ, వెబ్‌డెస్క్ : లాస్ట్ ఇయర్ సమ్మర్ లో స్టార్ట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమా కరోనా దెబ్బకి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే చాలా కాలం నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి న్యూ ఇయర్ విషెస్ పోస్టర్ కొంత హ్యాపీనెస్ ఇచ్చింది. త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు అన్న హింట్ తో ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.

త్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అరవింద సమేతతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ ఈ సారి కూడా అదే హిట్ ని రిపీట్ చెయ్యడానికి వెయిట్ చేస్తున్నారు. దానికోసం త్రివిక్రమ్ .. ఫుల్ మీల్ ప్యాకేజ్ ని రెడీ చేస్తున్నారు. ఫుల్ హెవీ స్టార్ కాస్ట్ ని ఫిక్స్ చేసే పనిలో పడ్డారు త్రివిక్రమ్ .ఎన్టీఆర్ సినిమాకి గ్రాండియర్ యాడ్ చెయ్యడం కోసం తన స్టైల్లో ఫుల్ హెవీ స్టార్ కాస్ట్ ని సెట్ చేస్తున్నారు.

సీనియర్ హీరోలు జయం రవి, ఉపేంద్రతో పాటు నెగెటివ్ రోల్ లో సంజయ్ దత్ ని ఫిక్స్ చేద్దామని ఆలోచిస్తున్నారట. అంతేకాదు .. త్రివిక్రమ్ కి ఈ మధ్య కలిసొస్తున్న ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్ట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారట. ఇలా త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ సినిమాకి అరవింద సమేతకి మించిన హంగులు ఆర్బాటాలతో త్రివిక్రమ్ మార్క్ స్క్రీన్ నిండా జనాలతో ఫుల్ ఫ్యామిలీ మీల్ ని రెడీ చేస్తున్నారట. అందుకే ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరకెక్కుతుందా..? ఎప్పుడెప్పుడు తెరమీదకొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

అయితే వీరు చేయనున్న సినిమాకు ఇప్పటి వరకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే పేరును అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు త్రివిక్రమ్ సెంటిమెంట్ ‘అ’ను పక్కన పెట్టి కొత్తగా నాయుడు సెంటిమెంట్‌తో పేరును పెట్టనున్నారట. ఈ చిత్రానికి ఎన్‌టీఆర్ ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును సజెస్ట్ చేశాడనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా పేరు ఏమని పెడతారన్న విషయం ప్రస్తుతం ఎన్‌టీఆర్ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story