వర్ల రామయ్యకు బిగ్ షాక్.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే..

by  |
వర్ల రామయ్యకు బిగ్ షాక్.. అదీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే..
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు భార్య పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్ద రగడే నడిచింది. అయితే ఈ విషయం పై స్పందిస్తూ నందమూరి ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియాలో వార్ ప్రకటించింది. ఇందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నారా భువనేశ్వరికి మద్దతుగా వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మాటల్లో పదును లేదు. ఇలాగేనా విమర్శించేది అంటూ టీడీపీ నాయకులు వర్ల రామయ్య, బుద్దా వెంకన్న లాంటి వాళ్లు తెగ మాట్లాడారు.

ఇంత వరకూ ఎలా ఉన్నా అక్కడే ఎన్టీఆర్ అభిమానులకు ఈ మాటలు మింగుడు పడలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఎన్టీఆర్ ను తిట్టినా మొట్టమొదట రియాక్ట్ అయ్యేది కుప్పం అభిమానులే. చంద్రబాబు ఎదురుగానే ఎన్టీఆర్ అప్ కమింగ్ సీఎం అంటూ జెండాలు ఎగరేశారు. కుప్పం మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కూడా ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా టీడీపీ కి ఓటు వేయద్దూ అంటూ పెద్ద ప్రచారమే నిర్వహించారు.

టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇప్పుడు కుప్పం నడిబొడ్డున ధర్నా నిర్వహించారు. పిచ్చి పిచ్చి మాటలు మానుకోవాలని టీడీపీ నాయకులను హెచ్చరించారు. మీ రాజకీయ రొచ్చు లోకి మా నాయకుడిని ఎందుకు లాగుతున్నారంటూ ఫైర్ అయ్యారు. బాబులకే బాబు మా తారక్ బాబూ అంటూ పరోక్షంగా చంద్రబాబుకు చురకలు అంటించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నుంచి ఎస్ఆర్ఎం థియేటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అనుమతి లేకపోయినా తగ్గేదే లే అంటూ టీడీపీ నాయకుల పై విరుచుకు పడుతూ ధర్నా నిర్వహించారు.

Next Story

Most Viewed