70 వేల మందికి టీకా అందించిన ఎన్‌టీపీసీ!

by  |
70 వేల మందికి టీకా అందించిన ఎన్‌టీపీసీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ తన ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులందరూ కలిపి దాదాపు 70,000 మందికి కరోనా టీకాను వేసినట్టు బుధవారం తెలిపింది. సంస్థ ప్లాంట్లలో ఇంకా భారీస్థాయిలో టీకా డ్రైవ్ కొనసాగుతోందని, ఇందులో కంపెనీ అసోసియేట్స్‌తో పాటు రిటైర్డ్ ఎన్‌టీపీసీ ఉద్యోగులు కూడా ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ఎన్‌టీపీసీ తన ఫ్రంట్‌లైన్ కార్మికులు, రిటైర్డ్ సిబ్బందిలో 60 ఏళ్లు, ప్రస్తుతం ఉన్నవారిలో 45 ఏళ్లకు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది. అలాగే, 18-48 ఏళ్ల వయసు ఉన్నవారిలో అర్హత కలిగిన వారికి టీకా వేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. టీకా అందించడంలో అర్హతగల ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారందిరికీ కంపెనీ లక్ష్యంగా చేసుకుందని ఓ ప్రకటనలో తెలిపింది. దీనికోసం సంస్థ కొవిడ్ సంబంధిత కార్యకలాపాల కోసం జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.


Next Story

Most Viewed