Trump Tariff Plan: భారత్‌నూ వదలని ట్రంప్.. భారీగా సుంకాల వడ్డింపు

by Mahesh Kanagandla |

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌ ప్లాన్‌ను బుధవారం వైట్‌హౌజ్‌లో ప్రకటించారు. ఒక వైపు ట్రేడ్ డీల్‌పై సంప్రదింపులు జరుగుతున్నా.. భారత్‌పైనా భారీగా టారిఫ్‌లు విధించారు. భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే.. అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. తాము సుంకాలు తగ్గించాలంటే ముందుగా విదేశాలు తగ్గించాలని, అమెరికాలో ప్లాంట్లు పెట్టి, ఉత్పత్తి చేస్తే సున్నా సుంకం ఉంటుందని పేర్కొన్నారు. ఇది అమెరికా పరిశ్రమకు పునర్జన్మ అని అభిప్రాయపడ్డారు.

Trump Tariff Plan: భారత్‌నూ వదలని ట్రంప్.. భారీగా సుంకాల వడ్డింపు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(America President Donald Trump) అనుకున్నంత పని చేశారు. విదేశీ ఉత్పత్తులపై టారిఫ్‌ ప్లాన్‌(Trump Tariff Plan)ను బుధవారం వైట్‌హౌజ్‌లో ప్రకటించారు. ఒక వైపు ట్రేడ్ డీల్‌(Trade Deal)పై సంప్రదింపులు జరుగుతున్నా.. భారత్‌పైనా భారీగా టారిఫ్‌లు విధించారు. భారత్‌పై 26 శాతం సుంకాలు(26% Tariffs) విధిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే.. అన్ని దేశాలకు సంబంధించి ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. తాము సుంకాలు తగ్గించాలంటే ముందుగా విదేశాలు తగ్గించాలని, అమెరికాలో ప్లాంట్లు పెట్టి, ఉత్పత్తి చేస్తే సున్నా సుంకం ఉంటుందని పేర్కొన్నారు. ఇది అమెరికా పరిశ్రమకు పునర్జన్మ అని అభిప్రాయపడ్డారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ ప్లాన్‌ను బుధవారం ప్రకటించారు. భారత్, చైనా, వియత్నాం సహా పలుదేశాలపై నిర్ణయించిన టారిఫ్‌లను వరుసగా వెల్లడించారు. విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్‌లు విధిస్తున్నాయో.. అందులో సగం మేరకు తాము ఆ దేశాల ఉత్పత్తులపై విధిస్తామని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 52 శాతం సుంకాలు(కరెన్సీ మ్యానిపులేషన్, ట్రేడ్ బారియర్లు కలుపుకుని ) విధిస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అందుకు ప్రతిగా తాము భారత్‌పై 26 శాతం పన్ను వేస్తామని ప్రకటించారు. చైనాపై తమ ఉత్పత్తులపై 68 శాతం విధిస్తున్నదని, తాము ఆ దేశ ఉత్పత్తులపై 34 శాతం విధిస్తున్నట్టు వెల్లడించారు. అత్యధికంగా కంబోడియా(49 శాతం)వియత్నాం(46 శాతం) వేస్తామని, బేస్‌గా 10 శాతం టారిఫ్‌లు తప్పకుండా ఉంటాయని స్పష్టం చేశారు. ఆటోమొబైల్స్‌పై 25 శాతం టారిఫ్‌లు విధించే నిర్ణయాన్ని ధ్రువీకరించారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. విదేశాల్లో తయారైన ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అలాగే, విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో సుంకాలు విధిస్తున్నారో అంతే మొత్తంలో తాము విధిస్తామని, ఇదే రెసిప్రోకల్ టారిఫ్ ట్రంప్ వివరించారు. ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తూ తాను సమాంతరంగా టారిఫ్‌లు విధించే వాడినేనని, కానీ, కొన్ని దేశాలు ఆ టారిఫ్‌లు భరించలేవని, అందుకే వాటిని సగానికి కుదించానని వివరించారు.

మీరు తగ్గిస్తే.. మేం తగ్గిస్తాం

‘మేం టారిఫ్‌లు పెంచామని ఎవరూ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. మేం తగ్గించాలంటే.. ముందు మీరు సుంకాలు తగ్గించండి. మీ ఉత్పత్తులపై సుంకాలు ఉండొద్దంటే.. మీ కంపెనీలు మా దేశంలో ప్లాంట్లు పెట్టాలి. ఇక్కడే ఉత్పత్తులు చేయాలి. అలాగైతే వాటిపై సున్నా సుంకం ఉంటుంది. ఇప్పటికే మా దేశంలోకి గతంలో ఎన్నడూ లేని విధంగా కంపెనీలు వెల్లువలా వస్తున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. మోటార్ సైకిల్ ఉదాహరణ చెబుతూ భారత్ పేరును ప్రస్తావించారు. మోటార్ సైకిళ్లపై అమెరికా 2.4 శాతం సుంకం విధిస్తే థాయ్‌లాండ్ వంటి దేశాలు 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం, మరికొన్ని దేశాలు ఇంకా అధికంగా సుంకాలు విధిస్తున్నాయని చెప్పారు.

దశాబ్దాలుగా దోచేశారు

అమెరికా సంపదను కొన్ని దశాబ్దాలుగా విదేశాలు దోచేస్తున్నాయని, శత్రువులు, మిత్రులు అన్నీ ఒకే విధంగా దోపిడీ చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అందుకే తాము కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని, నేటి లిబరేషన్ డే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అమెరికా మళ్లీ సుసంపన్నమవుతుందని, ఈ రోజు అమెరికా పరిశ్రమలకు పునర్జన్మ అని వివరించారు.

ట్రేడ్ డీల్ జరుగుతున్నా..

అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ ఫైనల్ కానుంది. అమెరికా నుంచి టారిఫ్‌ల ముప్పును ఎదుర్కోవడానికి భారత్ పలు మినహాయింపులకూ సిద్ధమైంది. ఈ డీల్ ద్వారా ట్రంప్ టారిఫ్‌లను అడ్డుకోవచ్చని అంతా భావించారు. కానీ, డొనాల్డ్ ట్రంప్ భారత్‌పైనా సుంకాలు వడ్డించారు.

Next Story