విమానంలో పనిచేయని టాయిలెట్స్.. ప్రయాణికులు ఏం చేశారంటే?

by Ajay Maddhiboyina |

విమానంలో టాయిలెట్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణికులు ఏకంగా నీళ్ల బాటిల్స్‌లో మూత్ర విసర్జన చేశారు. ఈ షాకింగ్ వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటు చేసుకుంది.

విమానంలో పనిచేయని టాయిలెట్స్.. ప్రయాణికులు ఏం చేశారంటే?
X

దిశ, వెబ్ డెస్క్: విమానంలో టాయిలెట్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ప్ర‌యాణికులు ఏకంగా నీళ్ల బాటిల్స్‌లో మూత్ర విసర్జన చేశారు. ఈ షాకింగ్ వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో చోటు చేసుకుంది. గతవారం ఇది జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలి నుండి బ్రిస్బేన్‌కు వెళుతున్న విమానం గాలిలో ఉన్న సమయంలోనే అందులో టాయిలెట్లలో సమస్య నెలకొంది. టాయిలెట్లు పనిచేయకపోవడంతో ప్రయాణికులు చేసేది లేక నీళ్ల బాటిళ్లలో మూత్రం పోశారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణికులు టాయిలెట్ల సమస్యతో ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. చివరికి సమస్య పరిష్కారం అవ్వకపోవడంతో బాటిల్స్‌లోనే పోసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా విమానయాన సంస్థ స్పందించింది. టాయిలెట్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బందిపడటంతో వారికి క్షమాపణలు చెప్పింది.

Next Story