- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూజీలాండ్ లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో "న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ" ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో "తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక"లను ఘనంగా నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : న్యూజీలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో "న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ" ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో "తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుక"లను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు 'కోడూరి చంద్రశేఖర్' అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా 'Dr.మోహన్ కుమార్ సేథి' ముఖ్య గా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. భారత దేశానికి సుదూరాన ఉన్నప్పటికీ న్యూజిలాండ్ నేల మీద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నెలకొల్పి భావి తరాలకి అందించడానికి సహృద్భహ వాతావరణాన్ని కల్పించి సహకరిస్తున్న న్యూజీలాండ్ ప్రభుత్వానికి , దేశ వాసులైన మౌరి సమాజానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేశారు అలాగే ఈ మధ్య నూతనంగా ఆక్లాండ్ నగరం లో ఇండియన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని నెలకొల్పి కాన్సులేట్ సేవలని అందిస్తున్నందుకు నిండు సభలో ప్రత్యేక తీర్మానం ద్వారా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేసారు.
ఈ సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సభలో కాన్సులేట్ జనరల్ తో పాటు అసోసియేషన్ కి విశేష సేవలు అందించిన గత కార్యవర్గ సభ్యులని సన్మానించి మెమెంటోస్ అందించారు. ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల.. సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్ తోపాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన శివ కిలారి, సత్యనారాయణ తట్టల, రాజేంద్ర ధరణికోట, ప్రదీప్ మేడసాని, రోహిత్ తమ్మినేని, లెజెండరీ మార్టుగేజ్ ప్రతినిధులు, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, శైలజ బాలకుల్ల, మధు ఎర్ర, శశికాంత్ గున్నల, లింగం గుండెల్లి, కావ్యా మాశెట్టి, వర్ష పట్లోళ్ల, స్వాతి గుడిమెళ్ళ, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, సందీప్ నాగుల, పవనకుమార్ చారుకొండ, సలీం మహమ్మద్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, కిరణ్ కుమార్ కొమ్ముల, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, విజయకుమార్ రెడ్డి చింతిరెడ్డి తదితరులతో పాటు పెద్దఎత్తున తెలంగాణ ప్రజానీకం హాజరయ్యారు.






