సౌదీ అరేబియా వెళ్లే వారికి అలర్ట్..ఇకపై ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే !

by velandi.Saikiran |

సౌదీ అరేబియాకు వచ్చేటప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్టు కచ్చితంగా అప్లోడ్ చేయాలని వెల్లడించింది సౌదీ.

సౌదీ అరేబియా వెళ్లే వారికి అలర్ట్..ఇకపై ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియా.... అభివృద్ధిలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నదన్న సంగతి తెలిసిందే. చాలా దేశాల నుంచి వచ్చే కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది సౌదీ అరేబియా. మన ఇండియా నుంచి కూడా సౌదీ అరేబియా కు... చాలామంది ఉపాధి కోసం వెళ్తున్నారు. అయితే ఇతర దేశాల నుంచి కార్మికులు.. తమ ప్రాంతానికి వచ్చేటప్పుడు సౌదీ అరేబియా అనేక కఠిన రూల్స్ అమలు చేస్తోంది. ప్రతి సర్టిఫికెట్ చూసిన అనంతరం... విదేశీయులను ఆహ్వానిస్తోంది సౌదీ అరేబియా.

అయితే ఇలాంటి నేపథ్యంలో సౌదీ అరేబియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి సౌదీ అరేబియా కు వచ్చే ప్రయాణికుల హెల్త్ అప్డేట్ తెలుసుకున్న తర్వాతే.. వాళ్లకు అనుమతిస్తోంది. డ్రగ్స్ అలాగే సైకోట్రోపిక్ లాంటి పదార్థాలను అరికట్టేందుకు సౌదీ అరేబియా కొత్త రూల్స్ అమలు చేస్తోంది. ఏదైనా అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులు సౌదీ అరేబియా కు వచ్చేటప్పుడు కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్టు కచ్చితంగా అప్లోడ్ చేయాలని వెల్లడించింది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ.

CDS ఫ్లాట్ ఫామ్ ద్వారా పర్సనల్ ఖాతాను ఓపెన్ చేసి... అందులో ట్రిప్ వివరాలతో పాటు డాక్టర్ సర్టిఫికెట్స్ కచ్చితంగా అప్లోడ్ చేయాలని వెల్లడించింది. ఆ సర్టిఫికెట్స్ ఉంటేనే అనుమతి ఇవ్వాలని.. సౌదీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెబ్సైట్ లో ఉన్నాయని వివరించింది.

Next Story