Sand Boa: రెండు తలలు కలిగిన అరుదైన పాములు ఇక్కడ పెరుగుతున్నాయి.. వాటి ధర కోట్లలో ఉంటుందని తెలుసా?

by Vennela |

Sand Boa: ప్రపంచంలో అనేక రకాల పాములు(Snakes) ఉంటాయి.

Sand Boa: రెండు తలలు కలిగిన అరుదైన పాములు ఇక్కడ పెరుగుతున్నాయి.. వాటి ధర కోట్లలో ఉంటుందని తెలుసా?
X

దిశ,వెబ్‌డెస్క్: Sand Boa: ప్రపంచంలో అనేక రకాల పాములు(Snakes) ఉంటాయి. అయితే కొన్ని పాములు(Snakes) చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి. అటువంటి వాటిలో ఒకటి రెండు తలల పాము(Two-Headed Snakes) కూడా. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని వాన్ విహార్ స్నేక్ పార్క్ లో (Wan Vihar Snake Park) లో ఈ అరుదైన పాములు ఉన్నాయి. వాటి ధర విదేశీ మార్కెట్లో రూ. 5 నుంచి 6కోట్లు పలుకుతున్నాయి. సాండ్ బోవా(Sand Boa)జాతికి చెందిన ఈ పాములను రెండు తలల పాములు అని కూడా అంటారు. ప్రస్తుతం వీటి సంఖ్య ఐదు. స్నేక్ పార్క్ లో వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పుడు అవే పాములు కొన్ని మూఢనమ్మకాలు, అపోహల వల్ల విదేశీ మార్కెట్లో వీటి ధర కోట్ల రూపాయలు పలుకుతుండటంతో స్మగ్లర్లకు లక్ష్యంగా మారాయి. వన్యప్రాణుల సంరక్షణ అధికారులు.. మాట్లాడుతూ ఇవి విషపూరితమైన పాములు కాదని.. ఇతర పాములతో పోలిస్తే మందకొడిగా ఉంటాయని తెలిపారు. అందుకే ఈ సాండ్ బోవా(Sand Boa) జాతికి చెందిన పాముల ఉనికి కష్టంగా మారిందన్నారు.

అయితే ఈ పాములు కామోద్దీపన మందుల(Aphrodisiacs)కు ప్రభావవంతంగా పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా విదేశీ మార్కెట్‌లో దీనికి డిమాండ్ ఉంది. విదేశాలలో దీనిని రూ. 1.5 నుండి 2 కోట్లకు కొనుగోలు జరుగుతున్నాయి. ఈ దురాశ కారణంగానే అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వాన్ విహార్‌(Wan Vihar Snake Park) లోని పాముల పార్కులో ప్రస్తుతం విషపూరితమైన.. విషం లేని పాములు రెండూ రకాల ఉన్నాయి. వీటిలో పైథాన్, రస్సెల్ వైపర్, ఇతర జాతులు ఉన్నాయి. కింగ్ కోబ్రా(King Cobra)ను రక్షించి ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు.

అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా(King Cobra)ను కర్ణాటక నుండి తీసుకువచ్చి వాన్ విహార్ లో ఉంచున్నట్లు తెలిపారు. స్నాక్ పార్క్ దగ్గర దీనిని ప్రదర్శించడానికి ఒక సెటప్‌ను సిద్ధం చేస్తున్నట్లు వాన్ విహార్ అధికారులు తెలిపారు. అరుదైన పాముల పెంపకం ఇక్కడ జరుగుతుంది. వాటి సంఖ్య పెరిగినప్పుడు, వాటిని అడవిలోకి వదిలివేస్తారు. అటవీ అభయారణ్యంలో అరుదైన జాతుల జంతువులను రక్షించడం జరుగుతోందని తెలిపారు.

అయితే ఈ అరుదైన సాండ్ బోవా(Sand Boa) పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్, కాస్మోటిక్స్ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఉపయోగించే ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. వందలు, వేలు కాదు ఏకంగా కోట్లు పెడితే తప్ప సొంతం చేసుకోలేరు. అంతేకాదు దీనిని ఇంట్లో పెంచుకుంటే అంతా మంచి జరుగుతుందని కొందరి నమ్మకం.

Next Story