ఆప‌ద‌లో శ్రీలంక..రంగంలోకి ప్రధాని మోడీ, భారీ సాయం ప్ర‌క‌ట‌న‌ !

by velandi.Saikiran |

ఆపరేషన్ సాగర్ బంధు కింద శ్రీలంక బాధితులకు నిరంతరం సహాయం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేశారు.

ఆప‌ద‌లో శ్రీలంక..రంగంలోకి ప్రధాని మోడీ, భారీ సాయం ప్ర‌క‌ట‌న‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆపదలో ఉన్న శ్రీలంక దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. దిత్వా తుఫాన్ ( Cyclone Ditwah) కారణంగా నష్టపోయిన శ్రీలంక దేశానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆపరేషన్ సాగర్ బంధు కింద శ్రీలంక బాధితులకు నిరంతరం సహాయం అందిస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేశారు.

ఇది ఇలా ఉండ‌గా, శ్రీలంకలో దిత్వా తుఫాన్ ప్రభావానికి దాదాపు 300 మంది మరణించారు. లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామాగ్రిని పంపింది ఇండియా. ఈ త‌రుణంలోనే భార‌త స‌ర్కార్, ప్రధాని నరేంద్ర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక‌కు ఇప్పుడే కాదు, గ‌తంలో కూడా ఇండియా సాయం చేసింది. ఇటీవ‌లే అఫ్ఘ‌నిస్తాన్ కు సాయం అందించింది. పాకిస్తాన్ తో యుద్ధం జ‌రిగిన స‌మ‌యంలో, అఫ్ఘ‌నిస్తాన్ కు అన్ని విధాలా సాయం అందించి, ఆదుకుంది ఇండియా.

Next Story