- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో పద్మశాలి వనభోజనాలు.. అత్యంత గ్రాండ్‌గా సెలబ్రేషన్స్
అమెరికాలోని డల్లాస్ నగరంలో నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్(American Padmashali Association) - నాపా(NAPA) ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని డల్లాస్ నగరంలో నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్(American Padmashali Association) - నాపా(NAPA) ఆధ్వర్యంలో ఘనంగా వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. నాపా డల్లాస్ చాప్టర్ లక్ష్మణ్ మంత్రి(Laxman Mantri) అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నాపా అమెరికా అధ్యక్షులు సాయిని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, లిటిల్ ఎల్మ్ నగర డిప్యూటీ మేయర్ టోనీ సింగ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మే 3, 2025 శనివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి డల్లాస్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. డల్లాస్ నగరంలో స్థిరపడిన పద్మశాలీలు కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
లిటిల్ ఎల్మ్ నగర డిప్యూటీ మేయర్ టోనీ(Little Elm City Deputy Mayor Tony) మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున పద్మశాలీ కుటుంబ సభ్యులు కలవడం వారిలోని ఐకమత్యాన్ని సూచిస్తుందని, ఇదే ఐకమత్యంతో ముందు తరాలకు మన సంస్కృతీ సంప్రదాయాలను అందజేయాలని సూచించారు. ముఖ్య అతిధి నాపా అధ్యక్షులు శ్రీనివాస్ సాయిని మాట్లాడుతూ.. అమెరికాలో స్థిరపడిన పద్మశాలీ కులస్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు నాపా ఏర్పడిందని, నాపా ద్వారా మన మాతృ దేశంలో విద్య, ఉద్యోగ, జీవన భృతి కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలోని ప్రతీ రాష్ట్రానికి నాపా విస్తరించినట్లు, ఆయా చాఫ్టర్ల ద్వారా అక్కడి పద్మశాలీలకు అవసరమైన సహాయ సహాకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. 13 సెప్టెంబర్ 2025న జరుగబోయే నాపా కన్వెన్షన్‌కు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
నాపా డల్లాస్ చాప్టర్ డైరెక్టర్ మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ఇంత భారీగా విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. 2018 నుండి ప్రతి సంవత్సరం డల్లాస్ నగరంలో నాపా ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున వనభోజనాలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ సందర్భంగా చెస్ పోటీలు నిర్వహించి గెలిచిన పిల్లలతో పాటు, పాటలు పాడి, డాన్సులు చేసి అలరించిన పిల్లలకు బహుమతులు అందజేశారు.
టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్, సాన్ ఆంటానియో, హౌస్టన్ తదితర నగరాల నుండి కూడా భారీ ఎత్తున పద్మశాలీలు హాజరయ్యారు. నాపా టెక్సాస్ చాప్టర్ కీలక సభ్యులు సంతోష్-వైష్ణవి బొజ్జ, సమత మనపురి, మీనా అంకం, చక్రి-ప్రసన్న చిక్క, రోహిత్-ఇందు కారంపూడి, రేవంత్-సరిత కోత, లీనా గంజి, రాహుల్-పల్లవి మాదాసు, అంజి పులిజాల, సంతోష్ రచ్చ, రజని-అర్చన చిప్ప, రాజు రాపోలు, అనిల్-స్వప్న ఆలే, సతీష్ చిట్టిప్రోలు, భవాని మంత్రి, రాఘవేంద్ర-స్వప్న జక్కని, తులసీదాస్-మాధురి మంత్రి కార్యక్రమం విజయవంతం కావడానికి కీలకంగా చేశారు. వారితో పాటు నాపా ఎగ్జిక్యూటివ్ సభ్యులు సంతోష్ అంకం, మల్లిక్ గంజి, ఉదయ్ దాసరి, మహేష్ మనపురి తదితరులు సహకరించారు.






