న్యూజిలాండ్ ను వదిలేస్తున్న పౌరులు...షాకింగ్ రిపోర్ట్ ఇదే !

by velandi.Saikiran |

యువత అలాగే నైపుణ్యం కలిగిన కార్మికులు ఎక్కువ సంఖ్యలో న్యూజిలాండ్ ను వదిలేస్తున్నారు.

న్యూజిలాండ్ ను వదిలేస్తున్న పౌరులు...షాకింగ్ రిపోర్ట్ ఇదే !
X

దిశ, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ దేశం ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ దేశాన్ని జనాలు వదిలేస్తున్నారు. ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. పక్కన ఉన్న ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ నుంచి చాలామంది వలస వెళ్తున్నారు. న్యూజిలాండ్ దేశంలో కంటే ఆస్ట్రేలియాలో.. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... పౌరులు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. యువత అలాగే నైపుణ్యం కలిగిన కార్మికులు ఎక్కువ సంఖ్యలో న్యూజిలాండ్ ను వదిలేస్తున్నారు.

దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది. నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిపోయింది. న్యూజిలాండ్ లో ఒక కుటుంబం జీవించాలంటే ఎక్కువ స్థాయిలో ఖర్చు అవుతోంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ విపరీతంగా పెరిగిపోయింది.

గతంలో ఎన్నడు లేని విధంగా 5.2 శాతం నిరుద్యోగ రేటు పెరిగింది. దీంతో న్యూజిలాండ్ ను వదిలి ఆస్ట్రేలియా లేదా బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వలసలను ఆపేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీలకు రుణాలు కూడా అందించేందుకు సిద్ధమవుతోంది న్యూజిలాండ్ సర్కార్. క్లిక్

Next Story