- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
killed: వ్యాన్ బావిలో పడి 10 మంది మృతి.. మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడింది.

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని మంద్‌సౌర్ (Manda sour) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడింది. దీంతో 10 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్లాంకు చెందిన పలువురు వ్యక్తులు ఓ వివాహానికి హాజరై మానస ప్రాంతంలో ఉన్న అంతర్రీ మాత ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మంద్‌సౌర్ జిల్లా నారాయణ్‌గఢ్ (Narayan gad) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధ-తక్రావత్ కల్వర్టు వద్ద బైక్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం గమనార్హం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిపోయిన వ్యాన్, ప్రజలకు బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. డిప్యూటీ సీఎం జగదీష్ దేవ్డా (Jagdheesh devda) ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.






