- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kangana Ranaut: ఊర్లో అందరి బిల్లు నా ముఖాన కొట్టారా? లక్ష కరెంట్ బిల్లుపై ఫైర్ బ్రాండ్ ఆగ్రహం
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. తన ఇంటికి రూ. లక్ష కరెంట్ బిల్లు వచ్చిందన్న ఫైర్ బ్రాండ్..అసలు ఆ ఇంట్లో తాము నివాసమే ఉండటం లేదంటూ పేర్కొన్నారు. అలాంటప్పుడు లక్ష రూపాయల బిల్లు ఎలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనాలీలో ఉన్న మా ఇంటికి ఈ నెల లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. ఈ మధ్యకాలంలో నేను ఆ ఇంట్లో ఉండటం లేదు. దీంతో ఆ బిల్లు చూసి షాకయ్యాను. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న ఇలాంటి పరిస్థితులు సిగ్గు చేటు. అయినప్పటికీ మనందరికీ ఓ ఛాన్స్ ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆమె వ్యాఖ్యానించారు.
సుఖు ప్రభుత్వం హిమాచల్‌ను నాశనం చేసిందని కంగనా అన్నారు. రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతోందని, ఏజెన్సీలు సమోసాలపై పనిచేస్తున్నాయని కంగనా అన్నారు. రాష్ట్రాన్ని మనం ప్రగతి పథంలో నడిపించాలి. ప్రజా పనుల మంత్రి విక్రమాదిత్య సింగ్‌పై కూడా కంగనా విమర్శలు గుప్పించింది. తాను ఎక్కడో అదృశ్యమైన మిస్టర్ ఇండియా కాదని కంగనా అన్నారు. ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి బయటపడాలని కంగనా మరోసారి విక్రమాదిత్యకు సలహా ఇచ్చింది. బాల్‌లో విమానాశ్రయం నిర్మించాలని కేంద్రంలో లాబీయింగ్ చేశానని కంగనా చెప్పారు. బిజెపి నాయకులకు పని చేయడానికి ధైర్యం ఉందన్నారు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.






