TANA: బాల కవులకు ఆహ్వానం.. తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ “బాల సాహిత్య భేరి”

by Ramesh Naini |

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ‘బాల సాహిత్య భేరి’ పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

TANA: బాల కవులకు ఆహ్వానం.. తానా ఆధ్వర్యంలో అంతర్జాతీయ “బాల సాహిత్య భేరి”
X

దిశ, డైనమిక్ బ్యూరో: (TANA) తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ‘బాల సాహిత్య భేరి’ పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నవంబర్ 30న అంతర్జాతీయ అంతర్జాల శతాధిక బాలకవుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 నుంచి 15 ఏళ్ల వయస్సు గల బాల, బాలికలు కథ, వచన కవిత, గేయం, పద్యం విభాగాలలో తమ స్వీయ రచనలను ప్రదర్శించవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు తమ రచనను ఒక పేజీకి మించకుండా వ్రాసి, పేరు, ఊరు, తరగతి, దేశం, ఫోన్ నెంబర్ వంటి వివరాలతో కలిసి వాట్సాప్ నెంబర్ +91 91210 81595 కు నవంబర్ 14 లోపు పంపించాల్సి ఉంటుంది. ఎంపికైన బాల రచయితలకు నవంబర్ 30న జరిగే తానా అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు 13 గంటల పాటు నిరంతరంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. ఈ విషయాన్ని తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

Next Story