Pahalgam Attack: చైనా, రష్యాలను వేడుకుంటున్న పాకిస్థాన్‌.. కారణం ఇదే.. ఎంత దారుణ పరిస్థితి వచ్చింది బ్రో మీకు

by Vennela |

Pahalgam Attack: చైనా, రష్యాలను వేడుకుంటున్న పాకిస్థాన్‌.. కారణం ఇదే.. ఎంత దారుణ పరిస్థితి వచ్చింది బ్రో మీకు
X

దిశ, వెబ్ డెస్క్: Pahalgam Attack: పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్‌లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఈ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లో మందుల కొరత ఏర్పడింది. ఇప్పుడు దాయాది దేశం సహాయం కోసం ఇతర దేశాల ముందు మోకారిల్లుతోంది.

పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. భారతదేశం ఆంక్షలు విధించినప్పటి నుండి పాకిస్తాన్ భయాందోళనలో ఉంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇంట్లో ఈగల మోత...బయట పల్లకిలా మోత అన్నట్లుగా పాక్ పరిస్థితి ఉంది. భారత్ ఆంక్షలు విధించినప్పటి నుంచి దాయాది దేశంలో మందుల సరఫరా ఆగిపోయింది. ఇప్పుడు అత్యవసర పరిష్కారాల కోసం వెతుకుతోంది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, భారతదేశంతో వాణిజ్యం ఆగిపోయిన తర్వాత, పాకిస్తాన్ ప్రభుత్వం ఔషధాల డిమాండ్‌ను తీర్చడానికి ఇతర దేశాలను ప్రాదేపడుతోంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక సమాచారం లేదని పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ధృవీకరించింది. అయితే ఇప్పటికే అత్యవసర ప్రణాళిక అమలులో ఉంది.

ప్రస్తుతం పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో 40 శాతం వరకు భారతదేశంపై ఆధారపడి ఉంది. ఇందులో క్రియాశీల ఔషధ పదార్థాలు, వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ చైనా, రష్యాలతో సంబంధాలు ఏర్పరచుకుంటోంది. తద్వారా పాకిస్తాన్ తన వైద్య అవసరాలను తీర్చుకోగలనని భావిస్తోంది. పాకిస్తాన్ తన ఔషధాల ముడి పదార్థాలలో 30-40 శాతం భారతదేశం నుండే దిగుమతి చేసుకుంటుందని జాతీయ ఆరోగ్య సేవలు నియంత్రణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు పేరు వెల్లడించడానికి ఇష్టపడని పరిస్థితిపై తెలిపారు.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరపడం గమనార్హం. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. కాగా 17 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయంపై NIA దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, సైన్యం నిరంతరం చర్య తీసుకుంటోంది. ఇప్పటివరకు ఆమె కాశ్మీర్‌లో 8 మంది ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసింది.

Next Story