- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
UAE: ట్రాఫిక్ రూల్స్... యూఏఈలోని డ్రైవర్లకు అదిరిపోయే శుభవార్త !
యాక్సిడెంట్ ఫ్రీ డే " నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల అంటే.. ఆగస్టు 25వ తేదీన యాక్సిడెంట్ ఫ్రీ డే కార్యక్రమాన

దిశ, వెబ్ డెస్క్: యూఏఈ లో కఠినమైన రూల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. చిన్న తప్పిదం చేసిన పెద్ద శిక్షలు ఏర్పడతాయి. ఇక డ్రైవింగ్ విషయంలో డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మనలాగా కాకుండా గీత దాటితే వాత పెట్టడం అక్కడ గ్యారంటీ. ఒక్కసారి ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే.... అప్పుడప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇక కొంతమందికి డ్రైవర్ల లైసెన్సులో బ్లాక్ పాయింట్లు జోడిస్తూ ఉంటారు. అలా రిపీట్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే తాజాగా యూఏఈలో ఉన్న డ్రైవర్లకు అక్కడి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. " యాక్సిడెంట్ ఫ్రీ డే " నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల అంటే.. ఆగస్టు 25వ తేదీన యాక్సిడెంట్ ఫ్రీ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ ప్రతిజ్ఞలో భాగంగా... యాక్సిడెంట్లు చేయకుండా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాహనాలు నడిపిన డ్రైవర్లకు ఊరట కల్పించనుంది ప్రభుత్వం. రూల్స్ పాటించిన డ్రైవర్లకు 4 బ్లాక్ పాయింట్లు తొలగించే అవకాశాన్ని కల్పించింది. అందుకే ఈ కార్యక్రమంలో.. డ్రైవర్లు అందరూ పాల్గొనాలని కీలక ప్రకటన చేసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పైన ప్రత్యేకంగా క్లాస్ కూడా నిర్వహిస్తారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రైనింగ్ కూడా ఇస్తారు.






