- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ ఆజాద్ కు అస్వస్థత
సౌదీకి వెళ్లిన ఎంపీ గులాం నబీ ఆజాద్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాకిస్తాన్ ఉగ్ర

దిశ, వెబ్ డెస్క్: సౌదీకి వెళ్లిన ఎంపీ గులాం నబీ ఆజాద్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను ఎండగట్టేందుకు.. తాజాగా సౌదీకి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఎంపీ గులాం నబీ ఆజాద్ ( Ghulam Nabi Azad). ఈ నేపథ్యంలో రియాజ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎంపీ గులాం నబీ ఆజాద్.
ఇంకా భారత బృందానికి సారథ్యం వహిస్తున్న బిజెపి ఎంపీ జయంత్ పాండా ( BJP MP Jayant Panda)... ఆయన ఆరోగ్యం పై మాట్లాడారు. గులాం నబీ ఆజాద్ ఆరోగ్యం... ఇప్పుడు స్థిరంగా ఉందన్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వివరించారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉందని వైద్యులు వివరించినట్లు చెప్పారు. బహ్రయిన్, కువైట్ పర్యటనలో ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు బిజెపి ఎంపీ జయంత్. అయితే సౌదీ అలాగే అల్జీరియా మీటింగ్స్ లో ఆయనను మిస్ అవుతామని.. పేర్కొన్నారు.






