Elon Musk Party: కొత్త పార్టీపై ఎలాన్ మ‌స్క్ మ‌రో లీక్..ఇంట్రెస్టింగ్‌గా పార్టీ పేరు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-07 07:27:22  IST  )

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం కొనసాగున్న సంగతి తెలిసిందే. ఇదరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

Elon Musk Party: కొత్త పార్టీపై ఎలాన్ మ‌స్క్ మ‌రో లీక్..ఇంట్రెస్టింగ్‌గా పార్టీ పేరు
X

దిశ, వెబ్ డెస్క్: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం కొనసాగున్న సంగతి తెలిసిందే. ఇదరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీపై లీకులు ఇవ్వడం అగ్రదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ఒక్కరూ మస్క్ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కొత్త పార్టీపై ట్వీట్టర్ పోల్ నిర్వహించాడు. ఈ పోల్‌కు విశేష స్పందన వచ్చింది.

56 లక్షల మందికి పైగా ఓటింగ్ వేశారు. కొత్త పార్టీ పెట్టాలి అంటూ 80 శాతం మంది మస్క్‌కు సూచించారు. అంతే కాకుండా అమెరిక్లను రిప్రెజెంట్ చేసేలా పార్టీ పేరు ఉండాలని సూచించారు. కాగా తన పార్టీపై మస్క్ మరో లీక్ ఇచ్చారు. ది అమెరికా పార్టీ అంటూ మస్క్ పార్టీ పేరును షేర్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. ఆ త‌ర‌వాత మ‌రో ట్వీట్‌లో మస్క్ అమెరికా జీడీపీపై మరో ట్వీట్ చేశారు. 2035 నాటికి అమెరికాలో ఆర్థిక అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానిని నివారించడానికి విధాన మార్పులు అవసరం అని అభిప్రాయపడ్డారు.

Next Story