- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరిజోనాలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు
అమెరికాలోని అరిజోనాలో నిర్వహించిన టీటీఏ మెగా బతుకమ్మ, దసరా వేడుక ఘనంగా జరిగింది. 3,500 మందికి పైగా వివిధ వర్గాల వారు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ..

దిశ, వెబ్ డెస్క్: ఇది తెలుగు ఆత్మకు ప్రతిబింబం, ఇది మన సంస్కృతికి సజీవ సాక్ష్యం, ఇది సంప్రదాయాలపై మనకున్న అచంచల విశ్వాసానికి ప్రతీక. ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మ, దసరా పండుగను మన తెలుగు వారు జరుపుకున్నారు. అమెరికాలోని అరిజోనాలో నిర్వహించిన టీటీఏ మెగా బతుకమ్మ, దసరా వేడుక ఘనంగా జరిగింది. 3,500 మందికి పైగా వివిధ వర్గాల వారు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
మన సంస్కృతిని ప్రతిబింబించే, సమాజ బంధాన్ని పెంపొందించే అర్థవంతమైన కార్యక్రమాల మరిన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ జ్యోతి రెడ్డి దుడిపాల, ప్రవీణ్ సమల, స్టేట్ కోఆర్డినేటర్స్ శ్రవణ్ కుమార్ గంప, వసంత సుమంత్, రామకృష్ణ నల్ల, రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ అనూప్ గోదిశాల, అవినాష్ రెడ్డి నండ్యాల, దినేష్ రెడ్డి సుడుల, వాసవి రెడ్డి లింగాల, వినోద్ గార్డస్, కోశాధికారులు పంకజ్ కుమార్ పడాల, ప్రదీప్ చందుపట్ల తదితరులు పాల్గొన్నారు.






