మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు

by Vemula.Srinu Prasad |

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది....

మళ్లీ కరోనా విజృంభణ.. వెయ్యికి పైగా యాక్టివ్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా(Carona) రక్కసి మళ్లీ విజృంభిస్తోంది. గతంలో వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ ఇప్పుడు చాపకింద నీరులా మరింతగా విస్తరిస్తోంది. దేశంలో గత వారంలో 257 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణతో పాటు కేరళ,తమిళనాడు, మహారాష్ట్రలోనూ ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వివిధ రకాల వేరియంట్లు, సబ్ వేరియంట్ల రూపంలో కరోనా వ్యాప్తి చెందుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్త ప్రకటించింది. గతంలో మాదిరి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. మనుషుల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలని, ఏ వస్తువునైనా పట్టుకున్న తర్వాత చేతులు బాగా కడుక్కోవాలని, శానిటైజర్స్ వినియోగించుకోవాలని, మూతికి మాస్కులు ధరించాలని పేర్కొంది.

Next Story