అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు... కొలంబియాలో ఉద్రిక్తత వాతావరణం

by Ajay Maddhiboyina |

అమెరికాలోని కొలంబియాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొలంబియా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి పై కాల్పులు జరిగాయి. కొలంబియన్ మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష

అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు... కొలంబియాలో ఉద్రిక్తత వాతావరణం
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోని కొలంబియాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కొలంబియా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థి పై కాల్పులు జరిగాయి. కొలంబియన్ మితవాద ప్రతిపక్ష సెనేటర్, వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థి మిగ్యుల్ ఉరిబ్ టర్బే(39) ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొగోటాలోని ఓ పార్క్ లో ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తిని కొలంబియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మిగ్యుల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బే ప్రసంగిస్తుండగా, కాల్పులు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. వెంటనే అప్రమత్తమైన తన అనుచరులు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇక ఆయన తలకు ఒక బుల్లెట్ తగిలినట్లు స్థానిక మీడియా తెలిపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story