మలేషియాలో గ్రాండ్‌గా బోనాల ఉత్సవం.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు

by Gantepaka Srikanth |

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో మలేషియాలో తొలిసారిగా బోనాల పండుగ(Bonala Festival)ను నిర్వహించారు.

మలేషియాలో గ్రాండ్‌గా బోనాల ఉత్సవం.. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో మలేషియాలో తొలిసారిగా బోనాల పండుగ(Bonala Festival)ను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవం జరిపారు. ఈ వేడుకలో వందకిపైగా తెలుగు కుటుంబాలు, భారతీయ వలసదారులు మరియు మలేషియాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. బోనం అర్పణ, జానపద నృత్యాలు, మరియు ఊరేగింపు తదితర కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా MYTA ప్రతినిధులు మాట్లాడుతూ.. బోనాల్ని మలేషియాలో నిర్వహించడం మా సంస్కృతిని కాపాడటమే కాదు.. మలేషియన్ సమాజంలో మన సంప్రదాయాలను పంచుకునే అవకాశం లభించిందని ప్రెసిడెంట్ తిరుపతి అన్నారు. ఇది మా అసోసియేషన్‌కు గర్వకారణమన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఈ వేడుకను కొనసాగిద్దామని ప్రకటించారు.




Next Story