- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై పెళ్ళికి ముందే HIVతో పాటు ఆ పరీక్షలు.. !
పెళ్లి కంటే ముందు వధూ వరులు ఇద్దరు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని.. అక్కడి ప్రభుత్వం నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : బహ్రెయిన్ దేశం చాలా అభివృద్ధి చెందిన సంగతి తెలిసిందే. కేవలం 16 లక్షల జనాభా ఉన్న ఈ కంట్రీలో... అక్కడి ప్రభుత్వం కఠిన రూల్స్ అమలు చేస్తూ ఉంటుంది. చిన్న తప్పిదం చేసినా.. పెద్ద శిక్షలు వేస్తూ ఉంటుంది. సౌదీ కంటే కాస్త ప్రమాదకరమే అంటారు. అయితే అలాంటి బహ్రెయిన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కంటే ముందు వధూ వరులు ఇద్దరు కూడా ఆరోగ్య పరీక్షలు చేయించు కోవాలని.. అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రూల్ ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపైన ఇంకా అధికారిక ప్రకటన చేయని ప్రభుత్వం... త్వరలోనే ఈ రూల్ అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఈ రూల్ ప్రకారం హెచ్ఐవి, డ్రగ్స్, మానసిక ఆరోగ్య, జన్యు అలాగే ఇతర అంటూ వ్యాధుల పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటేనే.. వివాహం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సౌదీ అరేబియాలో ఇలాంటి రూల్ ఇప్పటికే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీన్నే ప్రీ మ్యారేజ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అంటారు. ఈ రూల్ అమలు చేసి దాదాపు 60 శాతం అనారోగ్యకరంగా ఉన్న వాళ్ల వివాహాలను సౌదీ అరేబియా ఆపేసింది. పెళ్లి కంటే ముందు.. ఇలాంటి పరీక్షలు చేసుకోవడం వల్ల.. వాళ్లకు జన్మించే పిల్లలు.. బలంగా పుడతారన్న నమ్మకంతోనే... బహ్రెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






