సింగ‌రేణిలో 372 ఉద్యోగాలు

by  |
సింగ‌రేణిలో 372 ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఈ కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఉద్యోగాలు: 372

విభాగాల‌వారీగా ఖాళీలు: ఫిట్ట‌ర్ ట్రెయినీ-128, ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ-51, వెల్డ‌ర్ ట్రెయినీ-54, ట‌ర్న‌ర్/ మోషినిస్ట్‌ ట్రెయినీ-22, మోటార్ మెకానిక్ ట్రెయినీ-14, పౌండ్రీ మెన్‌/మ‌ఔల్డ‌ర్ ట్రెయినీ-19, జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్స్-84

గ‌మ‌నిక‌: ‌జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్స్ (మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే) పోస్టులు మిన‌హా మిగ‌తావ‌న్ని క్యేట‌గిరి 1 సంబంధించిన (పురుషుల‌కు మాత్ర‌మే) పోస్టులు

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత‌ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (ఐటిఐ) మ‌రియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వోకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి . ‌జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్స్ పోస్టుల‌కు ఇంటర్ ఉత్తీర్ణతతోపాటు డిప్లమా లేదా జిఎన్ఎమ్ సర్టిఫికెట్ కోర్సు లేదా బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత.

వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

లోకల్ జిల్లాలు: పాత జిల్లాల వారీగా ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్

నాన్ లోకల్ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా

రాతపరీక్షలో కేటగిరీల వారీగా అర్హతలు:

ఓసీ అభ్యర్థులు 30 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 25 శాతం మార్కులు, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులు 15శాతం మార్కులు కంపల్సరిగా సాధించవలసి ఉంటుంది.

పరీక్ష ఫీజు: రూ.200

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 04-‌02-2021

వెబ్‌సైట్: https://scclmines.com/scclnew/careers.asp

ఆర్బీఐలో 322 ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్


Next Story