- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీజీ డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
<p>దిశ, వరంగల్ సిటీ: ఈ నెల 24, 25వ తేదీల్లో పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 25 సాయంత్రం 4 గంటల వరకూ ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ […]</p>

దిశ, వరంగల్ సిటీ: ఈ నెల 24, 25వ తేదీల్లో పీజీ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 25 సాయంత్రం 4 గంటల వరకూ ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలన్నారు. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయి జాయిన్ కానీ అభ్యర్థులు, అదే విధంగా కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించారు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా పరిగణిస్తారని తెలిపారు.






