గుడ్ న్యూస్.. పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

by  |
Tslprb
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. ఆదివారం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ వివరాలను పోలీస్ శాఖ వెబ్‌సైట్
(www.tslprb.in)
లో అందుబాటులో ఉంచారు. డిగ్రీ, ఎల్​ఎల్​బీ లేదా బీఎల్​ పూర్తి చేసి కనీసం మూడేళ్ళ పాటు న్యాయవాద వృత్తిలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. అర్హత గల అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల్లో మార్కుల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరగనుంది.

నోటిఫికేషన్ వివరాలు..

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (కేటగిరి-7) తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్- 151 పోస్టులు
జీతం : రూ. 54,220 – 1,33,630.

మల్టీ జోనల్ విధానంలో ఖాళీల భర్తీ ప్రక్రియ చెపట్టారు. నోటిఫికేషన్ ప్రకారం..

01. Multi-Zone – Iలో 68 పోస్టులు
02. Multi-Zone – IIలో 83 పోస్టులు ఉన్నాయి.

తదితర వివరాలను గాను (www.tslprb.in) వెబ్‌సైబ్‌లో నోటిఫికేషన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.

Next Story

Most Viewed