- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీజీ మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
<p>దిశ, వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు నీట్–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్‌సైట్‌లో […]</p>

దిశ, వరంగల్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు నీట్–2020లో అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తులు https://pvttspgmed.tsche.in వెబ్‌సైట్‌లో అందుబాబాటులో ఉంటాయని, ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Tags: private medical colleges, menagement seats, notification, Kaloji Narayana Rao University of Health, warangal






