బాలీవుడ్ ఇండస్ర్టీలో వివక్ష ఉంది: సంచలన కామెంట్స్ చేసిన నటుడు

by  |
nawaj
X

దిశ, సినిమా: విభిన్న క్యారెక్టర్లతో బాలీవుడ్‌ ఇండస్ర్టీలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తాజాగా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేశాడు. చిత్ర పరిశ్రమలో నెపోటిజం కంటే ఎక్కువగా జాత్యాహంకార సమస్య ఉందని రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘సీరియస్‌ మెన్‌’ తర్వాత మరో మంచి సినిమాలో లీడ్‌ రోల్‌ వస్తే అదే ఇందిరా తివారికి విక్టరీ అని చెబుతూ, అంతేకాకుండా ‘బాలీవుడ్‌లో తెల్లగా ఉండేవాళ్లు మాత్రమే కాదు నల్లగా ఉన్నవారు కూడా హీరోయిన్లుగా నటించాలని కోరుకుంటున్నా. సమాజానికి మేలుచేసే మంచి సినిమాలు రావాలంటే సినీ పరిశ్రమలో పక్షపాతాలు ఉండకూడదు. నేను చాలా ఏళ్లుగా జాత్యాహంకార, అందం గురించిన వివక్షకు వ్యతిరేకంగా పోరాడాను. ఎందుకంటే నేను ఎత్తు తక్కువగా ఉంటాను. ఈ రకమైన భేషజాల వల్ల చాలామంది గొప్ప నటులు కనుమరుగైపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక నవాజ్ నటించిన ‘సీరియస్‌ మెన్‌’లో లీడ్‌ రోల్‌ పోషించిన ఇందిరా తివారి చిన్నగా, నల్లగా ఉండటంతో ఆమెకు మద్దతుగా ఈ కామెంట్స్‌ చేసిన నటుడు.. ఇటీవల సుధీర్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన ‘సీరియస్ మెన్’లో అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు నామినేషన్ పొందిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed