మాస్టర్ పాటకు ఐటెం గర్ల్ జబర్దస్తీ డాన్స్

by  |
మాస్టర్ పాటకు ఐటెం గర్ల్ జబర్దస్తీ డాన్స్
X

దిశ, సినిమా : హిందీతో పాటు పలు సౌత్ మూవీస్‌‌లో ఐటెం సాంగ్స్‌తో అదరగొట్టిన నోరా ఫతేహి ప్రస్తుతం డాన్స్ రియాలిటీ షో ‘డాన్స్ దివానే 3’కి జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షో అప్‌కమింగ్ ఎపిసోడ్‌కు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇళయ దళపతి విజయ్ హిట్ సాంగ్‌కు కంటెస్టెంట్లతో కలిసి కాలు కదిపింది. ఈ ప్రోమోలో ‘వాతి కమింగ్’ పాటకు కెనడియన్ మోడల్ నోరా వేసిన స్టెప్పులు నిజంగానే వావ్ అనేలా ఉన్నాయి.

కాగా ఈ వీడియోను షేర్ చేసిన కలర్స్ టీవీ.. ‘మా కంటెస్టెంట్లతో కలిసి నోరా ఫతేహి జబర్దస్త్ డాన్స్ మస్తీని #DanceDeewane3లో శనివారం రాత్రి 9 గంటలకు కలర్స్‌ టీవీలో చూడండి’ అని క్యాప్షన్ పెట్టింది. కాగా వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన ‘వాతికమింగ్’ సాంగ్‌కు పలువురు ఫిలిం సెలబ్రిటీలతో పాటు క్రికెటర్లు డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed