- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరి నామినేషన్ల తిరస్కరణ
<p>దిశ, పటాన్‌చెరు: పటాన్ చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్క్రూటినీ ప్రక్రియ శనివారం ముగిసింది. బల్దియా కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మూడు డివిజన్లలో మొత్తం అరవై మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వారిలో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు రిట్నరింగ్ అధికారులు తెలిపారు. పరిశీలనలో భారతీ నగర్ (111) డివిజన్ నుండి పెంటమ్మ, పటాన్ చెరు (113) డివిజన్ నుండి ఫృథ్వీ రాజ్‌లు వేసిన నామినేషన్లు అఫిడవిట్‌లు సమర్పించని కారణంగా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. బీ–ఫారంలు సమర్పించిన […]</p>

దిశ, పటాన్‌చెరు: పటాన్ చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్క్రూటినీ ప్రక్రియ శనివారం ముగిసింది. బల్దియా కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మూడు డివిజన్లలో మొత్తం అరవై మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వారిలో ఇద్దరి నామినేషన్లను తిరస్కరించినట్లు రిట్నరింగ్ అధికారులు తెలిపారు. పరిశీలనలో భారతీ నగర్ (111) డివిజన్ నుండి పెంటమ్మ, పటాన్ చెరు (113) డివిజన్ నుండి ఫృథ్వీ రాజ్‌లు వేసిన నామినేషన్లు అఫిడవిట్‌లు సమర్పించని కారణంగా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు.
బీ–ఫారంలు సమర్పించిన అభ్యర్ధులు
భారతీ నగర్ 111 డివిజన్ నుండి టీఆర్‌ఎస్ పార్టీ తరఫున వి. సింధు ఆదర్శ్ రెడ్డి, బీజేపీ- సి.గోదావరి అంజిరెడ్డి, టీడీపీ- మమతలు బీ–ఫారంలను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. రామచంద్రాపురం (112 )డివిజన్ నుండి టీఆర్‌ఎస్ పార్టీ బీ–ఫారంను బూరుగడ్డ పుష్ప నగేష్ యాదవ్, బీజేపీ పార్టీ బీ–ఫారంను సత్యనారయణ, టీడీపీ పార్టీ తరుపున పద్మజ బీ–ఫారంలను సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అదే విధంగా పటాన్ చెరు(113) డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ బీ–ఫారంను మెట్టుకుమార్ యాదవ్, బీజేపీ పార్టీ బీ–ఫారం ను టి.ఆశీష్ గౌడ్, టీడీపీ పార్టీ బీ–ఫారంను కమల్ డేవిడ్‌లు సమర్పించినట్లు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.






