5జీ ట్రయల్స్‌లో రికార్డు స్పీడ్ నమోదు చేసిన నోకియా!

by  |
5జీ ట్రయల్స్‌లో రికార్డు స్పీడ్ నమోదు చేసిన నోకియా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొత్త టెక్నాలజీ 5జీ సేవలకు సంబంధించి ప్రముఖ టెలికాం పరికరాల తయారీ కంపెనీ నోకియా ఇండియా ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నోకియా సంస్థ బుధవారం వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో పరీక్షలు జరిపింది. ఈ పరీక్షలో సెకనుకు 9.85 గిగాబైట్ల(జీబీపీఎస్) స్పీడ్‌ని నమోదు చేసి రికార్డులను బద్దలు కొట్టింది. ‘వొడాఫోన్ ఐడియాతో కలిసి 80 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌లో 9.85 జీబీపీస్ వేగంతో బ్యాక్‌ ఎండ్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ అయిందని’ నోకియా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

గుజరాత్‌లో ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్ పరీక్షలు నిర్వహించారు. ఫైబర్ నెట్‌వర్క్‌ను అమలు చేసేందుకు సవాలుగా ఉన్న ప్రాంతాల్లో చిన్న సెల్స్, మాక్రోసెల్స్‌ను ఫైబర్ నెట్‌వర్క్ వేగంతో ఈ-బ్యాండ్ ద్వారా కనెక్ట్ చేసి 5జీ సేవలను అందించేందుకు వొడాఫోన్ ఐడియాతో భాగస్వామ్యం కలిగి ఉండటం సంతోషంగా ఉందని కంపెనీ వివరించింది. ఇదివరకు సెప్టెంబర్‌లో వొడాఫోన్ ఐడియా జరిపిన 5జీ ట్రయల్స్‌లో 3.7 జీబీపీఎస్ గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది.

కాగా దేశీయంగా 5జీ ట్రయల్స్ నిర్వహించేందుకు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు టెలికాం విభాగం ఈ ఏడాది మేలో అనుమతిచ్చింది. 6 నెలల పాటు టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్ పరీక్షలను నిర్వహించనున్నాయి. ఇందులో భాగంగానే వొడాఫోన్ ఐడియా సంస్థకు 3.5 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను, 26 గిగాహెర్ట్జ్ హై-ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను కేటాయించింది.


Next Story

Most Viewed