నోయెల్ మాటలకు అర్థం ఏంటి?

by  |
నోయెల్ మాటలకు అర్థం ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్ :
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4.. గత మూడు సీజన్లకు మించిన ఎంటర్‌టైన్మెంట్ ఇస్తోంది. అసలు ఎప్పుడు ఎవరెలా ప్రవర్తిస్తారో కూడా తెలియట్లేదు. ఒక్కోసారి అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లాగే కనిపిస్తరు. అంతలోనే ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేలా విసుగు తెప్పిస్తరు. అప్పుడే ప్రేమగా మాట్లాడుకుంటరు.. అంతలోనే కొట్టుకున్నంత పని చేస్తరు. అప్పుడే పొగిడిన తోటి కంటెస్టెంట్‌ను మరో నిమిషంలో తిట్టిపోస్తుంటరు. అందరి విషయమేమో కానీ నోయెల్ విషయానికి వస్తే మాత్రం.. ఆడియన్స్ నిజంగా అవాక్కయ్యారు. ‘హగ్గింగ్ బాబా’ అంటూ హౌజ్‌‌‌లో ప్రేమను పంచిన నోయెల్.. అనుకోకుండా హౌజ్ నుంచి వెళ్లిపోయే టైమ్‌లో అవినాష్, అమ్మ రాజశేఖర్‌‌ను టార్గెట్ చేసి హారబుల్‌గా బిహేవ్ చేశాడు. అప్పటి వరకు హౌజ్‌ మేట్స్‌‌తో ఫ్రెండ్లీగా ఉన్న నోయెల్.. బయటకు వచ్చేటప్పుడు నెగెటివ్‌గా పొట్రేట్ చేసినట్లే అనిపించింది. అయితే ఈ విషయంలో కొందరు నోయెల్‌ను తప్పుపడితే.. మరికొందరు తనకు సపోర్ట్ ఇచ్చారు.

ఏదేమైనా నోయెల్ చేసిన కామెంట్స్‌తో హౌజ్‌లో రచ్చ రచ్చ అయింది. అవినాష్, అమ్మ రాజశేఖర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పదే పదే నోయెల్ మాటలను కోట్ చేస్తూ ఆడియన్స్ తమ గురించి ఏమనుకుంటున్నారో అని తెగ ఫీల్ అయిపోయారు. నోయెల్ ఇన్నాళ్లూ ప్రేమగా మాట్లాడిందంతా నటనేనని.. వెళ్లే ముందు అసలు రంగు బయటపడిందని కోపంతో ఊగిపోయారు. దీంతో పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదంటూ హోస్ట్ నాగార్జున వారిని కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేసినా.. ఆ తర్వాతి రోజు కూడా అదే కంటిన్యూ అయింది.

అయితే ఈ యాక్షన్, రియాక్షన్‌ల నడుమ.. బిగ్ బాస్ మరో ప్లాన్ చేశాడని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని చెప్పే బాస్.. ఈ వార్‌ను రేటింగ్ కోసం యూజ్ చేసే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. హౌజ్ లోపల అవినాష్, అమ్మ రాజశేఖర్ మాట్లాడుతున్న మాటలకు బయటకు వచ్చేసిన నోయెల్ కౌంటర్ ఇస్తున్నాడు. దీంతో ఈ కౌంటర్, రీ కౌంటర్లు హౌజ్‌లో ఉంటే బాగుంటుందని.. నోయెల్‌ను రీఎంట్రీ ఇప్పించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా నోయెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఈ రూమర్స్‌కు బలం చేకూరుస్తోంది. ‘ఈ సారి హౌజ్‌లోకి వెళ్తే మామూలుగా ఉండదు.. రచ్చ రచ్చే ఉంటది.. వెయిటింగ్’ అని నోయెల్ ఆ వీడియోలో పేర్కొనడం విశేషం.

కానీ రెండు నెలలు కాదు.. లైఫ్ లాంగ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకే నిర్ణయించుకున్నానని, అందుకే వెళ్లిపోతున్నానని చెప్పిన నోయెల్.. మళ్లీ తిరిగివస్తాడా? చూడాలి మరి.



Next Story

Most Viewed