- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

దిశ, వెబ్ డెస్క్: చైనాలోని వూహాన్ నగరంలో తొలిసారిగా గుర్తించిన కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించి ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలైతే చూపకపోయినా.. అన్ని దేశాలు మాత్రం చైనా వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ఈ అనుమానాలకు మరింత ఊతం ఇచ్చేలా మరొకరు కరోనా వైరస్ చైనానే తయారు చేసిందని బల్లగుద్ది చెబుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో పక్కా ఆధారాలతో ఒక రిపోర్టు విడుదల చేశారు. ఇన్నాళ్లూ అమెరికా చేసిన వాదనకు జపాన్ శాస్త్రవేత్త అధ్యయనం మరింత బలం చేకూర్చేలా మారడం సంచలనం సృష్టిస్తోంది. సహజంగా పుట్టిన వైరస్‌కు, ల్యాబ్‌లో సృష్టించిన వైరస్‌కు చాలా తేడా ఉంటుందని హోంజో అంటున్నారు. సహజంగా పుట్టిన వైరస్ అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒకేలా ప్రభావం చూపి ఉండదని ఆయన అంటున్నారు. ఆయా దేశాల ఉష్ణోగ్రతలను బట్టి వైరస్ ప్రభావం తీరు మారిపోతుందని ఆయన అన్నారు. చైనాతో సమాన ఉష్ణోగ్రత ఉన్న దేశాల్లో మాత్రమే ప్రభావం చూపేదన్నారు. కాని ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఈ వైరస్ కచ్చితంగా ల్యాబ్ సృష్టే అని హోంజో అంటున్నారు. కరోనా వైరస్ సహజమైనది కాదని తనకున్న పరిజ్ఞానం మరియు పరిశోధనల ఆధారంగా నూటికి నూరు శాతం విశ్వాసంతో చెప్పగలనన్నారు. ‘ఇది గబ్బిలాల నుండి రాలేదు. దీనిని చైనా తయారు చేసింది. ఈ రోజు నేను చెబుతున్నది అబద్ధమని నిరూపిస్తే ఎప్పుడైనా..ఆఖరికి నా చావు తర్వాతైనా నాకు ఇచ్చిన నోబెల్ రద్దుకు సమ్మతిస్తున్నాను’ అని ప్రకటించారు. ‘వైరస్ పుట్టుక గురించి చైనా అబద్దాలు చెబుతోందన్న విషయం త్వరలోనే ప్రపంచానికి అర్థమవుతుంది’ అని జపాన్ వైద్య శాస్త్రవేత్త తసుకు హోంజో చెప్పారు. చైనాలోని వూహాన్ ప్రయోగ శాలలో నాలుగేండ్లు పని చేశానని తసుకు హోంజో చెబుతున్నారు. ఆ ప్రయోగశాలలో పని చేసే సిబ్బంది అందరితో తనకు పరిచయం ఉంది. కాని ప్రస్తుతం వాళ్ల ఫోన్లు అన్నీ పని చేయడం లేదని ఆయన చెప్పారు. ఈ ల్యాబ్‌లో పని చేసిన టెక్నీషియన్లందరూ చనిపోయారని నాకు అర్థం అవుతోంది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి హోంజో థియరీపై చైనా ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Tags :Coronavirus, Covid-19, China, Wuhan Lab, Nobel Award, Scientist, Tasuku Honjo, Conspiracy