అధికారుల బదిలీలు బంద్ : సీఎం యోగి

by Shamantha N |   (  Updated:2020-05-12 22:10:59  IST  )

<p>కరోనా నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాధ్ సర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీల‌ను నిషేధించింది. ఐఏఎస్, ఐపీఎస్, పీసీఎస్, పీపీఎస్‌తో సహా అన్ని స్థాయిల‌ సిబ్బంది బదిలీల‌పై నిషేధం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఈ సమయంలో బదిలీలు చేపడితే అధికార యంత్రాంగంలో కొంత గందరగోళం నెలకొంటుందనే కారణంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు [&hellip;]</p>

అధికారుల బదిలీలు బంద్ : సీఎం యోగి
X

కరోనా నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాధ్ సర్కార్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ఉద్యోగుల బదిలీల‌ను నిషేధించింది. ఐఏఎస్, ఐపీఎస్, పీసీఎస్, పీపీఎస్‌తో సహా అన్ని స్థాయిల‌ సిబ్బంది బదిలీల‌పై నిషేధం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఈ సమయంలో బదిలీలు చేపడితే అధికార యంత్రాంగంలో కొంత గందరగోళం నెలకొంటుందనే కారణంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బదిలీల‌పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.అంతే కాకుండా పదవీ విరమణ, పదోన్నతి, సస్పెన్షన్, తొలగింపు, ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీ మొద‌లైన విష‌యాల్లో ముఖ్యమంత్రి అనుమతి త‌ప్ప‌నిసరి చేస్తూ ఉత్వర్వుల్లో పేర్కొంది.ఇదిలా ఉండగా కరోనా దెబ్బకు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నెలకొనగా ప్రభుత్వ ఉద్యోగులకు 6 రకాల అలవెన్సెస్‌ను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన యూపీలోని 16 లక్షల మంది ఉద్యోగులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

Next Story