మూసీకి ఢోకా లేదు -జగదీశ్ రెడ్డి

by  |
మూసీకి ఢోకా లేదు -జగదీశ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నల్లగొండ :మూసీ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఢోకా ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 4 గంటల సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి తీవ్రం కావడంతో అప్పటికప్పుడు అదే రాత్రి సూర్యపేట, నల్గొండ జిల్లా కలెక్టర్లతోపాటు నీటిపారుదల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.

సూర్యాపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదే సమయంలో ఆయకట్టు కింది ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసారు. అయినా వరద ఉధృతి తగ్గకపోవడంతో ఆయన హుటాహుటిన మూసీ ఆయకట్టు మీదకు చేరుకుని అత్యవసర ద్వారాలతో పాటు పూర్తిగా తలుపులు తీయించి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు.

దీంతో ఆయకట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. రెండు లక్షల పై చీలుకు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఒక్కసారిగా మూసీకి చేరడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వరదతో పాటు బిక్కేరు నుండి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేసేందుకు నీటిపారుదల అధికారులు ఇక్కడే ఉండి సమీక్షిస్తారని ఆయన తెలిపారు.



Next Story

Most Viewed