- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుడ్ కోర్టుకు తక్కువ కాదు…ఐదు రూపాయల భోజనం
<p>దిశ, కూకట్‌పల్లి: జీహెచ్‌ఎంసీ అందిస్తున్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు కూకట్‌పల్లి జోన్అధికారులు. పేద ప్రజలు, బాట సారుల ఆకలిని తీర్చడానికి జీహెచ్‌ఎంసీ, హరేరామ హరికృష్ణ సంస్థ సౌజన్యంతో అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనాన్ని అందిస్తుంది. రహదారులపై కూడళ్లలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాల వద్దకు వచ్చే వారు రోడ్లపైనే నిలుచుని భోజనం చేస్తుంటారు. కానీ కూకట్‌పల్లిలో వీటికి భిన్నంగా ఫుడ్‌స్టాల్‌లను […]</p>

దిశ, కూకట్‌పల్లి: జీహెచ్‌ఎంసీ అందిస్తున్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రాన్ని అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు కూకట్‌పల్లి జోన్అధికారులు. పేద ప్రజలు, బాట సారుల ఆకలిని తీర్చడానికి జీహెచ్‌ఎంసీ, హరేరామ హరికృష్ణ సంస్థ సౌజన్యంతో అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనాన్ని అందిస్తుంది. రహదారులపై కూడళ్లలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాల వద్దకు వచ్చే వారు రోడ్లపైనే నిలుచుని భోజనం చేస్తుంటారు.

కానీ కూకట్‌పల్లిలో వీటికి భిన్నంగా ఫుడ్‌స్టాల్‌లను పోలిన అన్నపూర్ణ క్యాంటిన్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. జోనల్ కమిషనర్ మమత ప్రత్యేక చొరవతో కూకట్‌పల్లి జోనల్‌కార్యాలయం ఎదురుగా ఉన్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రం వద్ద ఖాళీ స్థలంలో 7.5 లక్షల వ్యయంతో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి క్యాంటిన్ నిర్మించారు.
ఫుడ్ కోర్టులకు ఎందులోను తీసి పోని విధంగా రంగు రంగుల అలంకరణలతో, డిజైనర్ విద్యుత్ దీపాలతో డైనింగ్‌హాల్‌ను తయారు చేశారు. భోజనం చేయడానికి వచ్చిన వారు డైనింగ్ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బల్లలపై ప్లేట్లు పెట్టుకుని భుజించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్, తాగడానికి తాగు నీటిని ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆకలిని తీర్చడమే కాకుండా, వారు భోజనం చేయడానికి అనువైన స్థలాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్న జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ అధికారులను స్థానికులు అభినందిస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తాం: డి. గోవర్ధన్ గౌడ్, ఈఈ, కూకట్‌పల్లి సర్కిల్

జోనల్ కమిషనర్ మమత చొరవతో అన్నపూర్ణ కేంద్రానికి వచ్చే వారు భోజనం చేయడానికి ప్రత్యేకంగా డైనింగ్ హాల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. 7.5 లక్షల వ్యయంతో అన్నపూర్ణ క్యాంటిన్‌ను ఏర్పాటు చేసి ఫుడ్ కోర్టులను తలపించే విధంగా తయారు చేస్తున్నాం. త్వరలో అన్నపూర్ణ క్యాంటిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.






