- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
థర్డ్ వేవ్‌తో పిల్లలకు ముప్పుపై వాదనకు ఆధారాల్లేవ్: ఎయిమ్స్ చీఫ్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న వాదనలకు ఆధారాల్లేవని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. వచ్చే వేవ్‌తో పిల్లలకే ముప్పు అని చెప్పడానికి ఆధారాల్లేవని, కాబట్టి అందరూ భయాలను వదిలిపెట్టాలని అన్నారు. కరోనా పిల్లలకూ సోకుతుందని, కానీ, వారిపైనే ఎక్కువ ప్రభావముంటుందని చెప్పలేమని వివరించారు. వైరస్ ఆశ్రయం తీసుకున్న కణాలు అంత సులభంగా దానికి లొంగిపోవని, వారి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల కరోనా ముప్పు వారికి తక్కువగానే ఉంటుందని […]</p>

X
న్యూఢిల్లీ: థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్న వాదనలకు ఆధారాల్లేవని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా తెలిపారు. వచ్చే వేవ్‌తో పిల్లలకే ముప్పు అని చెప్పడానికి ఆధారాల్లేవని, కాబట్టి అందరూ భయాలను వదిలిపెట్టాలని అన్నారు. కరోనా పిల్లలకూ సోకుతుందని, కానీ, వారిపైనే ఎక్కువ ప్రభావముంటుందని చెప్పలేమని వివరించారు. వైరస్ ఆశ్రయం తీసుకున్న కణాలు అంత సులభంగా దానికి లొంగిపోవని, వారి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉండటం వల్ల కరోనా ముప్పు వారికి తక్కువగానే ఉంటుందని తెలిపారు. చాలా తక్కువ మంది చిన్నారుల్లో సివియారిటీ పెరగవచ్చునని వివరించారు. థర్డ్ వేవ్ కూడా సెకండ్ వేవ్‌లాగే వేగంగా విస్తరించి చాలా మందికి సోకితే, పిల్లల శాతమూ హెచ్చుతుందని, కానీ, వీరిలో సివియర్ కేసులు తక్కువగా ఉంటాయని అన్నారు.
Next Story






