- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ షెడ్యూల్ విడుదల ఎప్పుడు?
<p>దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ మినీ వేలం పూర్తయినా ఇంకా 14వ సీజన్ షెడ్యూల్ ఖరారు కాలేదు. వేలం సమయంలో స్పాన్సర్ల గురించి పూర్తి వివరాలు వెల్లడించిన చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాత్రం సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలపై స్పష్టతనివ్వలేదు. అసలు ఐపీఎల్ గతంలో మాదిరిగా 8 వేదికల్లో జరుగుతుందా? లేదా ఇండియాలోనే పరిమిత స్టేడియంలకు లీగ్‌ను కుదిస్తారా అనే దానిపై కూడా సందిగ్దత నెలకొన్నది. ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై స్పష్టత రాలేదని.. అయితే అన్ని ఫ్రాంచైజీలకు న్యాయం […]</p>

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ మినీ వేలం పూర్తయినా ఇంకా 14వ సీజన్ షెడ్యూల్ ఖరారు కాలేదు. వేలం సమయంలో స్పాన్సర్ల గురించి పూర్తి వివరాలు వెల్లడించిన చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాత్రం సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలపై స్పష్టతనివ్వలేదు. అసలు ఐపీఎల్ గతంలో మాదిరిగా 8 వేదికల్లో జరుగుతుందా? లేదా ఇండియాలోనే పరిమిత స్టేడియంలకు లీగ్‌ను కుదిస్తారా అనే దానిపై కూడా సందిగ్దత నెలకొన్నది. ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై స్పష్టత రాలేదని.. అయితే అన్ని ఫ్రాంచైజీలకు న్యాయం జరిగేలా టోర్నమెంట్ నిర్వహిస్తారనే ఆశాభావంతో ఉన్నట్లు సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. మినీ వేలం సమయంలో అనధికారికంగా కూడా ఎలాంటి సమాచారం అందించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించిన నేపథ్యంలో ఐపీఎల్ సజావుగా సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక వచ్చే వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగనున్నదని.. అక్కడ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం.






