సర్వేయర్ల బదిలీపై క్లారిటీ ఇచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి

by  |
Nizamabad Collector Narayana Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పోడు భూముల సర్వే ప్రక్రియను చేపట్టడం కోసమే అవసరం మేరకు సర్వేయర్లను బదిలీ చేయడం జరిగిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో సర్వేయర్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లాలో జరిగిన ఐదుగురు సర్వేయర్ల బదిలీ విషయం ప్రస్తావించారు. నిజామాబాద్ ల్యాండ్ సర్వే కార్యాలయం పరిధిలో పని చేస్తోన్న సర్వేయర్ల బదిలీలు ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఏదైనా సమస్యలుంటే పోడు భూముల సర్వే తర్వాత కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు.

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతి క్లిష్టమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, పరిష్కరించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్, సహా అధ్యక్షులు నారాయణ రెడ్డి, కోశాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, శ్రీనివాస్, అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు సుమన్ కుమార్, జాకీర్ హుస్సేన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



Next Story