ఏపీని వణికిస్తున్న నివర్ తుఫాను

by  |
ఏపీని వణికిస్తున్న నివర్ తుఫాను
X

దిశ, ఏపీ బ్యూరో: నివర్​ తుఫాను తమిళనాడుతో పాటు ఆంధ్రాను వణికిస్తోంది. తుఫాను ప్రభావం చిత్తూరు, నెల్లూరు, కడప, అనంపురం జిల్లాలపై అధికంగా ఉంది. కర్నూలు, గుంటూరు జిల్లాలపై పాక్షికంగా ఉంది. గడచిన 24 గంటల్లో రాష్ర్టంలోని పది మండలాల్లో 200 మిల్లీమీటర్లకు అధికంగా వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో కుండ పోత వర్షం కొనసాగింది. రేణిగుంట మండలంలోని కుమ్మరిలోవ చెరువులో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. అందులో ఇదర్ని ఎన్డీఆర్​ఆఫ్​బృందాలు కాపాడాయి. మరో రైతు ప్రసాదు ఆచూకీ తెలియలేదు.

బాలపల్లి చెక్​పోస్టు వద్ద రోడ్డుపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతి కడప మధ్య రాకపోకలు నిల్చిపోయాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయింది. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువు లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీరు ప్రవహించే స్థలాలు ఆక్రమణల పాలవ్వడం వల్ల రాయలచెరువు, చిట్టతురు, కాలేపల్లి, సురవారిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వెదురుకుప్పం మండలం పచ్చికాపలం పరిధిలో టీటీడీ కళ్యాణ మండపం వద్ద గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేటమట్టమయ్యాయి. పాల సముద్రం మండలం కావేరి రాజపురం, పాలసముద్రం గ్రామాల్లో వర్షానికి వరిపంట నేలమట్టమైంది. ఎస్ఆర్ పురం మండలం రాఘవ రాజపురం వంక ఉద్రిక్తంగా ప్రవహించడంతో గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా కురుస్తున్న వర్షాలకు ఎస్‌ఆర్ పురం మండలం పాత పాల్యం, పాపిరెడ్డి పల్లి వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎనిమిది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీకాళహస్తి వద్ద స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.


Next Story

Most Viewed